logo

నగరకంలొ కుండపోత వాన

Updated : 18 Jun 2024 05:09 IST

లక్డీకాపూల్‌ కూడలి వద్ద వాన నీటిలో తిప్పలు పడుతూ వెళ్తున్న వాహనదారులు

ఈనాడు, హైదరాబాద్‌: ఉరుములు, మెరుపులు, గాలులతో సోమవారం సాయంత్రం వరుణుడు విజృంభించాడు. గంటలోనే గోల్కొండ ప్రాంతంలో అత్యధికంగా 5.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. గోల్కొండ ఎండీ లైన్స్‌లో 200 ఏళ్ల నాటి చెట్టు నేలకూలింది. ఆ ఘటనలో పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా ఓ వ్యక్తి తలకు బలమైన గాయమైంది. వెంటనే డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మెహిదీపట్నంలో 5.7, యూసఫ్‌గూడలో 5.25, జూబ్లీహిల్స్‌లో 4.68, బంజారాహిల్స్‌లో 4.6, ఉప్పల్‌లో 3.68, షేక్‌పేటలో 3.63, ముషీరాబాద్‌లో 3.55, మాదాపూర్‌లో 3.5, బోరబండలో 3.35, పటాన్‌చెరులో 3.25, అబిడ్స్‌లో 3.2 సెం.మీ వర్షం కురిసింది. సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, ఇతర శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.


లక్డీకాపూల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద ఈ అరబ్‌ షేక్‌ వేషధారుడి బూట్లు తడవకుండా ఓ వ్యక్తి ఇలా ఎత్తుకుని తీసుకెళ్లాడు.


శ్రీకృష్ణానగర్‌లో వరదనీటిలో దూసుకెళ్తున్న కారు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు