logo

డీజే సిద్ధార్థ్‌ కేరాఫ్‌ కొకైన్‌

టీఎస్‌ న్యాబ్‌ ఆకస్మిక డ్రగ్స్‌ తనిఖీల్లో ఇద్దరు వినియోగదారులు పట్టుబడ్డారు. నగరంలోని కొన్ని పబ్బుల్లో డీజేగా పనిచేసే బంజారాహిల్స్‌ శ్రీరామ్‌నగర్‌కు చెందిన సిద్ధార్థ్, మాదాపూర్‌కు చెందిన స్వరూప్‌ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు.

Published : 18 Jun 2024 05:43 IST

టీఎస్‌ న్యాబ్‌ ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడ్డ నిందితుడు
16 మందిని పరీక్షించగా ఇద్దరికి పాజిటివ్‌.. కేసు నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌ న్యాబ్‌ ఆకస్మిక డ్రగ్స్‌ తనిఖీల్లో ఇద్దరు వినియోగదారులు పట్టుబడ్డారు. నగరంలోని కొన్ని పబ్బుల్లో డీజేగా పనిచేసే బంజారాహిల్స్‌ శ్రీరామ్‌నగర్‌కు చెందిన సిద్ధార్థ్, మాదాపూర్‌కు చెందిన స్వరూప్‌ను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. కొన్నాళ్లుగా వీరు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు గుర్తించిన టీఎస్‌ న్యాబ్‌ అధికారులు నిరంతరం నిఘా ఉంచారు. డ్రగ్స్‌ తీసుకున్న అనంతరం మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లోని పబ్బులకు వెళ్తున్నారు. డీజే సిద్ధార్థతో సహా 16 మంది డ్రగ్స్‌ వినియోగిస్తూ తరచూ పబ్బులకు వెళ్తున్నట్లు గుర్తించారు. వీరి కదలికల్ని గమనిస్తూ వచ్చిన అధికారులు ఆదివారం సాయంత్రం వీరందర్నీ వేర్వేరు పబ్బుల దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక కిట్‌ ద్వారా వీరి మూత్ర నమూనాలను పరిశీలించగా సిద్ధార్థ్, స్వరూప్‌ ఇద్దరూ కొకైన్, క్యానబిస్‌ తీసుకున్నట్లు తేలింది. వీరిద్దరినీ మాదాపూర్‌ ఠాణాకు తరలించి కేసు నమోదు చేసినట్లు టీఎస్‌ న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్‌ సరఫరాదారులు నిరంతరం పోలీసు నిఘాలో ఉంటారని, వారికి దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. పాఠశాలలు, అగ్రశ్రేణి సంస్థల్లో మాదకద్రవ్యాలను అడ్డుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే ఫోన్‌ 8712671111కు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని