logo

రామోజీరావు సేవలు చిరస్మరణీయం

దేశహితం, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసిన దివంగత రామోజీరావు సేవలు చిరస్మరణీయమని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్‌రావు కొనియాడారు.

Published : 19 Jun 2024 01:23 IST

నివాళులర్పిస్తున్న వెంకటేశ్వర్‌రావు, కార్యవర్గ సభ్యులు

కాచిగూడ, న్యూస్‌టుడే: దేశహితం, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసిన దివంగత రామోజీరావు సేవలు చిరస్మరణీయమని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్‌రావు కొనియాడారు. ఆయన  నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీపడకుండా పనిచేశారన్నారు. మంగళవారం కాచిగూడలోని మున్నూరు కాపు సంఘం కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. సంపూర్ణ మద్యపాన నిషేధం, వాననీటి  సంరక్షణ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత వైద్య శిబిరాలు, వరద బాధితులకు ఇళ్ల నిర్మాణం వంటి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టారని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి మంగళారపు లక్ష్మణ్, మున్నూరు కాపు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి కొండూరు వినోద్‌కుమార్, ఉపాధ్యక్షులు బీఆర్‌ జితేందర్, కట్టెల సుభాష్, సభ్యులు సురేష్‌బాబు, చెలిమెల రమేష్, శ్రవణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని