logo

నీట్‌ విద్యార్థుల భవితతో చెలగాటం

ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక డ్రామా కంపెనీ అని, ఆ కంపెనీని ఇక మూసుకొని పోయే సమయం ఆసన్నమైందని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు.

Published : 19 Jun 2024 01:19 IST

హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శలు

అబిడ్స్, న్యూస్‌టుడే: ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక డ్రామా కంపెనీ అని, ఆ కంపెనీని ఇక మూసుకొని పోయే సమయం ఆసన్నమైందని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. బక్రీద్‌ పండుగను పురస్కరించుకొని ఎంఐఎం ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి దారుస్సలాంలో భారీఎత్తున నిర్వహించిన ఈద్‌ మిలాప్‌లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. నీట్‌ పరీక్షను కేంద్ర ప్రభుత్వం ఆషామాషీగా తీసుకుంటోందని, ఫలితంగా పరీక్షలు రాసిన 24 లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందన్నారు. గతంలో రాష్ట్రాల్లో ఎంసెట్‌ పరీక్షలు సక్రమంగా జరిగేవని, కేంద్రం నీట్‌ తీసుకొచ్చి సంపన్నుల పిల్లలకు మేలు జరిగేలా చూస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యేలు అహ్మద్‌ పాషా ఖాద్రీ, ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్, ఎమ్మెల్యేలు జాఫర్‌హుస్సేన్, మీర్‌ జుల్ఫీకర్‌ అలీ ప్రసంగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని