logo

భవారియా గ్యాంగ్‌ ఎటు వెళ్లిందో!

వరుసగా నాలుగు చైన్‌ స్నాచింగ్‌లతో కలకలం రేపిన భవారియా గ్యాంగ్‌ సభ్యులు ఎటువైపు పరారయ్యారో పోలీసులకు అంతుచిక్కడం లేదు.

Published : 19 Jun 2024 01:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: వరుసగా నాలుగు చైన్‌ స్నాచింగ్‌లతో కలకలం రేపిన భవారియా గ్యాంగ్‌ సభ్యులు ఎటువైపు పరారయ్యారో పోలీసులకు అంతుచిక్కడం లేదు. శనివారం చోరీలు జరిగాక సాంకేతిక ఆధారాలతో గాలిస్తున్నా వారి ఆచూకీ మీద స్పష్టత రావడం లేదు. నిందితులు ద్విచక్రవాహనంపై వెళ్లిన దృశ్యాలు గజ్వేల్‌లోని ఓ ప్రాంతంలో సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ కెమెరాల్లో కనిపించిన తర్వాత చీర్యాలలో ఒక గొలుసు దొంగిలించారు. ఆ తర్వాత ఎటువైపు వెళ్లారనేది ఇంకా గుర్తించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సిద్ధిపేట వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఫుటేజీలు, ఇతర ఆధారాలపై దృష్టిసారించారు. నిందితులు చోరీలకు తిరిగేందుకు మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వాహనం చోరీ చేసినట్లు తేలింది. దోపిడీల తర్వాత ఆ వాహనాన్ని ఎక్కడ వదిలిపెట్టారో ఇంకా తెలియలేదు. ప్రత్యేక బృందాలతో నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. బైకు చోరీ తర్వాత వరుసగా చైన్‌ స్నాచింగ్‌లు చేయడం ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాకు చెందిన భవారియా గ్యాంగ్‌ శైలి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి కూడా ఒక బృందాన్ని పంపించనున్నారు. నిందితులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనే ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని