logo

ఠాణా.. దళారులకు ఖజానా

న్యాయం చేయాలంటూ ఠాణాలకు వస్తున్న బాధితుల్ని పోలీసుల కంటే ముందు దళారులే పలకరిస్తున్నారు. ‘ఏం జరిగిందో చెప్పండి.. ఫలానా పోలీసు అధికారి నాకు మంచి మిత్రుడు.

Updated : 19 Jun 2024 03:16 IST

పోలిస్‌స్టేషన్లే అడ్డాగా సెటిల్‌మెంట్లు
చేతులు కలుపుతోన్న కొందరు పోలీసులు
ఈనాడు- హైదరాబాద్‌

న్యాయం చేయాలంటూ ఠాణాలకు వస్తున్న బాధితుల్ని పోలీసుల కంటే ముందు దళారులే పలకరిస్తున్నారు. ‘ఏం జరిగిందో చెప్పండి.. ఫలానా పోలీసు అధికారి నాకు మంచి మిత్రుడు. మీకు కావాల్సిన పని చేసేపెట్టే బాధ్యత నాదంటూ..’ అందినకాడికి దండుకుంటున్నారు. ఘటన తీవ్రత ఆధారంగా రేటు మాట్లాడుకుంటూ పోలీస్‌స్టేషన్‌ అడ్డాగా సెటిల్‌మెంట్లకు దిగుతున్నారు. పోలీసుల్లో కొందరు ఎస్సైలు, సీనియర్‌ కానిస్టేబుళ్లు వీరికి అంతర్గతంగా సహకరిస్తున్నారు. కొందరు ఇన్‌స్పెక్టర్లకు తెలిసినా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. ఇటీవల కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్, ఎస్సై ఒక కేసు రాజీ కోసం మధ్యవర్తి ద్వారా రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కారు.

ఎవరొచ్చినా వీళ్లు లోకల్‌..

అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. నేను మాత్రం లోకల్‌.. అని సినిమా డైలాగ్‌ తరహాలో కొందరు దళారులు తమ పనిచేసుకుంటూ వెళ్తుంటారు. ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు బదిలీలపై వెళ్లినా.. కొత్తవారు వచ్చినా వీరి హవా కొనసాగుతోంది. 

  • సైబరాబాద్‌లోని ఓ ఠాణా ఆవరణలో ఓ నలుగురైదుగురు  ఎస్సై, కానిస్టేబుళ్ల స్థాయిలో అన్ని సెటిల్‌మెంట్లు పరిష్కరిస్తుంటారు.
  • హైదరాబాద్‌ పరిధిలో కొత్తగా ఏర్పాటైన ఠాణా దగ్గర ఒక నకిలీ పోలీసు అక్కడే ఉంటాడు. కేసును సెటిల్‌చేస్తానంటూ వసూళ్లు చేస్తాడు. ః రాచకొండ పరిధిలో కీలకప్రాంతంలోని పోలీస్‌స్టేషన్‌లో ఒక దళారీ.. ఎస్సై సహకారంతో  రుణం వేధింపుల కేసులు నమోదవకుండా రాజీ కుదిర్చినట్లు సమాచారం.
  • సైబరాబాద్‌లో ఒక పోలీస్‌స్టేషన్‌లో విద్యార్థి సంఘం నేతనంటూ ఓ వ్యక్తి కేసుల్ని రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని