logo

పట్నం మారాలె.. పచ్చని వనమల్లె

మహానగర వ్యాప్తంగా పచ్చదనం పరవళ్లు తొక్కేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. గత ప్రభుత్వం చేపట్టిన హరితహారం స్థానంలో ‘వజ్రోత్సవ వన మహోత్సవం’ పేరుతో కొత్త కార్యక్రమానికి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి శ్రీకారం చుడుతోంది.

Published : 19 Jun 2024 01:42 IST

వజ్రోత్సవ వన మహోత్సవం పేరుతో హరితహారం
జులై 1న శ్రీకారం
4 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధం

ఔటర్‌ సర్వీస్‌ రోడ్డులో పచ్చదనం

మహానగర వ్యాప్తంగా పచ్చదనం పరవళ్లు తొక్కేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. గత ప్రభుత్వం చేపట్టిన హరితహారం స్థానంలో ‘వజ్రోత్సవ వన మహోత్సవం’ పేరుతో కొత్త కార్యక్రమానికి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి శ్రీకారం చుడుతోంది. హెచ్‌ఎండీఏ ఇప్పుడు 7 జిల్లాలు..7200 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.   ఆయా ప్రాంతాల్లో పచ్చదనం కోసం ప్రత్యేక ప్రణాళికను హెచ్‌ఎండీఏ పరిధిలోని పట్టణ అటవీ విభాగం చేపట్టింది. ఇందుకు ప్రభుత్వం నుంచి రూ.381 కోట్ల వరకు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా 4 కోట్ల మొక్కలు నాటనున్నారు. నలభై నర్సరీల ద్వారా 165 రకాల మొక్కలు పెంచుతున్నారు. వీటిలో  40 రకాల వరకు ఫల జాతులకు చెందినవే.

శంషాబాద్‌ దారిలో..

ప్రపంచ నగరాలతో పోల్చితే భాగ్యనగరంలో 12.9 శాతం పచ్చదనం మాత్రమే ఉంది. గ్రేటర్‌లో 80 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. దీంతో భారీగా వాయు కాలుష్యం ఏర్పడుతోంది.  నగరం కూడా రోజురోజుకు కాంక్రీట్‌ జంగిల్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 33 శాతం వరకు నగరంలో పచ్చదనం పెంచాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఈ ఏడాది చివరి నాటికి తొలుత 18-20 శాతానికి తీసుకెళ్లాలని హెచ్‌ఎండీఏ యోచిస్తోంది.కొత్త పార్కులను అభివృద్ధి చేసి, ప్రస్తుతం ఉన్న పార్కులను కొంగొత్త థీమ్‌లతో తీర్చిదిద్దనున్నారు. డివైడర్లు, ర్యాంపులు, జంక్షన్లలో మొక్కలు పెంచనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని