logo

అంతర్గత పారిశుద్ధ్యం పక్కాగా సాగాలి

వర్షా కాలంలో గ్రామాల్లో అంతర్గత పారిశుద్ధ్యం పక్కాగా చేపట్టాలని వికారాబాద్‌ జిల్లా జెడ్పీ సీఈఓ సుధాకర్‌ పేర్కొన్నారు.

Published : 20 Jun 2024 00:56 IST

నవాబ్‌పేట, న్యూస్‌టుడే: వర్షా కాలంలో గ్రామాల్లో అంతర్గత పారిశుద్ధ్యం పక్కాగా చేపట్టాలని వికారాబాద్‌ జిల్లా జెడ్పీ సీఈఓ సుధాకర్‌ పేర్కొన్నారు. విధుల్లో చేరిన అనంతరం మొదటి సారిగా మండల పర్యటనకు వచ్చిన ఆయన బుధవారం నవాబుపేట మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ తీరు, ఇంటింటా మిషన్‌ భగీరథ సర్వే పనులు, అమ్మ ఆద]ర్శ పాఠశాలల తీరు, తాగునీటి సమస్య, వన నర్సరీలు, తెలంగాణకు హరితహారం తదితరాలపై చర్చించారు. విధులలో ఏమరపాటు తగదని, కార్యదర్శులు, గ్రామ పంచాయతీల్లో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ఉపాధి హామీ పనులు, వన నర్సరీల నిర్వహణ, తెలంగాణకు హరితహారం తదితర పనుల నిర్వహణలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అనురాధ, పర్యవేక్షకులు జగన్నాథ్‌రెడ్డి, అజయ్‌కుమార్, ఎంపీఓ విజయ్‌కుమార్, ఏపీఓ లక్ష్మీదేవి, ఈసీ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని