logo

బకాయిలు చెల్లించకుంటే నీటి కనెక్షన్‌ కట్‌

నీటి బిల్లుల మొండి బకాయిలపై  జలమండలి దృష్టి సారించింది. బుధవారం జరిగిన రెవెన్యూ సమీక్షలో జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి కీలకాదేశాలు జారీ చేశారు.

Published : 20 Jun 2024 01:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: నీటి బిల్లుల మొండి బకాయిలపై  జలమండలి దృష్టి సారించింది. బుధవారం జరిగిన రెవెన్యూ సమీక్షలో జలమండలి ఎండీ సుదర్శన్‌రెడ్డి కీలకాదేశాలు జారీ చేశారు. ఇప్పటికే భారీగా బకాయి పడిన ఇంటి యజమానుల జాబితాను జలమండలి సిద్ధం చేసింది. తొలుత వీరికి నోటీసులు అందించనున్నారు. అయినా చెల్లించడానికి ముందుకు రాకపోతే నల్లాల కనెక్షన్లను తొలగించనున్నారు. డివిజన్‌ 1 నుంచి 5 వరకు ఎక్కువ శాతం బకాయిలున్నట్లు తెలుస్తోంది. కొందరైతే ఏళ్లుగా చెల్లించడం లేదు. 

వాణిజ్య నల్లాలే అధికం: రూ.10 వేల కంటే ఎక్కువ బకాయిలు దాటిన గృహ, వాణిజ్య నల్లాలపై ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నట్లు జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. వీటితోపాటు వివిధ ప్రభుత్వ విభాగాలకు జలమండలే నీటిని సరఫరా చేస్తోంది. ఆయా సంస్థల బకాయిలు కూడా రూ. 1500 కోట్లు దాటాయి. ఈ బకాయిలపై ఆయా శాఖ హెచ్‌ఓడీలకు జలమండలి లేఖలు రాయాలని నిర్ణయించింది. కొత్త నల్లాలు, నీటి బిల్లుల ద్వారా జలమండలికి నెలకు రూ.115 నుంచి రూ.130 కోట్ల ఆదాయం వస్తోంది. జీతాలు, నిర్వహణ ఖర్చులు, విద్యుత్తు బిల్లుల కింద రూ.160 వరకు కోట్లు దాటుతోంది. అందుకే జలమండలి బకాయిలపై సీరియస్‌గా దృష్టి పెట్టింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని