logo

హిందూ తాత్విక భావన వారసత్వాన్ని కాపాడుకోవాలి

హిందూ ధర్మంలో ద్వేషం, అసమానతలకు తావులేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌లోని భాస్కరా ఆడిటోరియంలో అన్నమయ్య కళాక్షేత్రం, హిందూస్‌ ఫర్‌ ప్లూరలిటీ అండ్‌ ఈక్వాలిటీ(హెచ్‌పీఈ) ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య జయంతిని పురస్కరించుకొని ‘ద్వేషం, అసమానతలకు వ్యతిరేకంగా హిందూమతం’ అంశంపై మహాసమ్మేళనం నిర్వహించారు.

Published : 20 Jun 2024 01:05 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: హిందూ ధర్మంలో ద్వేషం, అసమానతలకు తావులేదని పలువురు వక్తలు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌లోని భాస్కరా ఆడిటోరియంలో అన్నమయ్య కళాక్షేత్రం, హిందూస్‌ ఫర్‌ ప్లూరలిటీ అండ్‌ ఈక్వాలిటీ(హెచ్‌పీఈ) ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య జయంతిని పురస్కరించుకొని ‘ద్వేషం, అసమానతలకు వ్యతిరేకంగా హిందూమతం’ అంశంపై మహాసమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయశంకర్‌స్వామి సమర్పణలో, జైభారత్‌ పబ్లికేషన్స్‌ ప్రచురించిన ‘అందరికీ శ్రీహరే అంతరాత్మ’ పుస్తకాన్ని చిలుకూరు బాలాజీ క్షేత్ర ప్రధానార్చకులు రంగరాజన్‌ ఆవిష్కరించి మాట్లాడుతూ.. తిరుమలలో అన్నమయ్య వైభవం పునరుద్ధరించే ప్రయత్నం జరగాలన్నారు. అమెరికా వంటి దేశాల్లో తమ పూర్వీకులు ప్రయాణం చేసిన ఎద్దుల బండ్లను చెదలు పట్టకుండా కాపాడుకుంటున్నారని, మరి కొన్ని లక్షల మందిని చైతన్యవంతుల్ని చేసిన అన్నమయ్య నివాసం ఉన్న ఇల్లును ఎందుకు కాపాడుకోకూడదని ప్రశ్నించారు. హెచ్‌పీఈ జాతీయ అధ్యక్షుడు సాధు త్రినాథదాస్‌ మాట్లాడుతూ.. ఏకత్వభావన, శాంతియుత సహజీవనం హిందూ మతానికి జీవనాడులన్నారు. విజయశంకరస్వామి మాట్లాడుతూ.. కొందరు చేస్తున్న కుట్రల వల హిందూ మతానికి ప్రమాదం పొంచి ఉందన్నారు. ఈ సందర్భంగా తిరుమలలో కూల్చిన అన్నమయ్య గృహాన్ని ప్రతిష్ఠించాలన్న తీర్మానాన్ని సమ్మేళనం ఆమోదించింది. విజయవిహారం రమణమూర్తి, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 8వ తరం వారసుడు వీరంభట్లయ్య స్వామి, దున్న విశ్వదాసు, బిర్లా మందిర్‌ ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని