logo

7 నుంచి గోల్కొండ బోనాలు

ఆషాఢమాసంలో తెలంగాణలో నిర్వహించే బోనాల ఉత్సవాలు చారిత్రక గోల్కొండ కోటలో జులై 7న ప్రారంభం కానున్నాయి.

Published : 20 Jun 2024 01:07 IST

గోల్కొండ, న్యూస్‌టుడే: ఆషాఢమాసంలో తెలంగాణలో నిర్వహించే బోనాల ఉత్సవాలు చారిత్రక గోల్కొండ కోటలో జులై 7న ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు కోటలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో ప్రారంభమైన అనంతరం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తారు.  జగదాంబిక అమ్మవారి ఆలయం, పరిసర ప్రాంతాలను దేవాదాయశాఖ వారు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.  కోటలో ఈ ఉత్సవాలు వారానికి రెండు రోజులు-గురువారం, ఆదివారం చొప్పున తొమ్మిది వారాల పాటు జరుగుతాయి. ఆయా వారాల్లో కేంద్రపురావస్తుశాఖ అధికారులు కోటలోకి ఉచిత ప్రవేశాన్ని కల్పిస్తారు. ఇప్పటికే ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో రంగులు వేసే పనులు ప్రారంభమయ్యాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఇ.శ్రీనివాసరాజు చెప్పారు. ఆలయంలో, పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఆగస్టు 4 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. ఏడో తేదీన లంగర్‌హౌస్‌ నుంచి గోల్కొండ వరకు తొట్టెల ఊరేగింపు ఉంటుందన్నారు.  ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రితో పాటు ఇతర మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని