logo

సర్కారు బడుల్లోనే చేర్పిద్దాం

సర్కారు బడుల్లోనే బడిఈడు పిల్లలను చేర్పించాలంటూ తెలంగాణ పౌరస్పందన వేదిక హైదరాబాద్‌ జిల్లా కమిటీ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తోంది.

Updated : 20 Jun 2024 04:28 IST

తెలంగాణ పౌరస్పందన వేదిక ప్రచారం

ఈనాడు,హైదరాబాద్‌: సర్కారు బడుల్లోనే బడిఈడు పిల్లలను చేర్పించాలంటూ తెలంగాణ పౌరస్పందన వేదిక హైదరాబాద్‌ జిల్లా కమిటీ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తోంది. తెలంగాణ పౌర స్పందన వేదిక ప్రతినిధులు ఎం.రాధేశ్యాం, ఎం.ఎ.సమ్మద్, లక్ష్మణ్‌రావు, ఎస్‌.వి.రామకృష్ణలు నగరంలోని నాగమయ్యకుంట, దీన్‌దయాళ్‌నగర్, శ్రీనివాస టెక్స్‌టైల్స్, జమిస్తాన్‌పూర్‌ ప్రాంతాల్లో బుధవారం ప్రచారం చేశారు. ఆయా ప్రాంతాల్లో ర్యాలీలుగా ప్రదర్శన నిర్వహించారు. జమిస్తాన్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రతి తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులున్నాయని, ఇప్పటికే విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను అందించారని ప్రచారంలో పేర్కొన్నారు.


స్వాగత ఏర్పాట్లు 

కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసి గురువారం మొదటిసారిగా నగరానికి వస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు, ఎంపీలకు ఘన స్వాగతం పలికేందుకు బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాట్లు పరిశీలిస్తూ సూచనలిస్తున్న భాజపా సీనియర్‌ నేతలు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి తదితరులు  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని