logo

అపోలోలో బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌ ఓపీ సేవలు

అపోలో క్యాన్సర్‌ సెంటర్‌ (ఏసీసీ) ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి వైద్య విధానానికి నాంది పలకనుంది. బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంట్‌ సర్వీసులను ఔట్‌ పేషెంట్‌ పద్ధతిలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ బుధవారం ప్రకటించింది.

Published : 20 Jun 2024 01:11 IST

ఫిలింనగర్, న్యూస్‌టుడే: అపోలో క్యాన్సర్‌ సెంటర్‌ (ఏసీసీ) ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి వైద్య విధానానికి నాంది పలకనుంది. బోన్‌ మారో ట్రాన్స్‌ప్లాంట్‌ సర్వీసులను ఔట్‌ పేషెంట్‌ పద్ధతిలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ బుధవారం ప్రకటించింది. తద్వారా లింఫోమా, మల్టిపుల్‌ మైలోమా ఇతర హెమటోలాజికల్‌ చికిత్సలో పలు మార్పులు రానున్నాయని స్పష్టం చేసింది. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అపోలో హాస్పిటల్స్‌ తెలంగాణ రీజినల్‌ సీఈవో తేజస్వీరావు మాట్లాడుతూ రోగులకు అవుట్‌ పేషెంట్‌ బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్‌ సేవల్ని తీసుకురావడంతో వారికి మరింత మేలు జరుగుతుందని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని