logo

నీట్‌ను రద్దు చేసి నిర్వహణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలకివ్వాలి

నీట్‌ నిర్వహణ, ఫలితాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి సంబంధిత విద్యార్థులకు న్యాయం చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Published : 20 Jun 2024 01:13 IST

నల్లకుంట, న్యూస్‌టుడే: నీట్‌ నిర్వహణ, ఫలితాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి సంబంధిత విద్యార్థులకు న్యాయం చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో నీట్‌ నిర్వహణపై ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో జరిగిన విద్యార్థులు, బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్‌ను నిర్వహించిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టీఏ) సుమారు 24 లక్షల మంది భావి భారత వైద్య విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. పరీక్ష ఫలితాలపై సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.విద్యార్థి, బీసీ సంఘాల నేతలు నీల వెంకటేశ్, సి.రాజేందర్, అనంతయ్య, రాజ్‌కుమార్, నర్సింహగౌడ్, మోడీ రాందేవ్, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


సుప్రీంకోర్టు జడ్జిచే విచారణ జరిపించాలి

కాచిగూడ, న్యూస్‌టుడే: నీట్‌ నిర్వహణ, ఫలితాల్లో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు సిటింగ్‌ జడ్జిచే న్యాయ విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు స్పందించాలని కోరారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని