logo

దోపిడీని ప్రతిఘటించిన దివ్యాంగుడిపై కత్తితో దాడి

దివ్యాంగుడైన డ్రైవర్‌ జేబులోంచి డబ్బు, చరవాణి దోపిడీకి ఓ దుండగుడు యత్నించాడు. మేల్కొని ప్రతిఘటించిన డ్రైవర్‌పై దుండగుడు కత్తితో దాడిచేసి మరో ఇద్దరు సన్నిహితులతో కలిసి పరారయ్యాడు.

Published : 20 Jun 2024 01:16 IST

కేశవగిరి, న్యూస్‌టుడే: దివ్యాంగుడైన డ్రైవర్‌ జేబులోంచి డబ్బు, చరవాణి దోపిడీకి ఓ దుండగుడు యత్నించాడు. మేల్కొని ప్రతిఘటించిన డ్రైవర్‌పై దుండగుడు కత్తితో దాడిచేసి మరో ఇద్దరు సన్నిహితులతో కలిసి పరారయ్యాడు. ఈ ఘటన చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన అబ్దుల్‌ రయీస్‌(22) దివ్యాంగుడు. డీసీఎం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. క్లీనర్‌ సల్మాన్‌(24)తో కలిసి నిజామాబాద్‌ నుంచి వాహనంలో బియ్యం లోడుతో చాంద్రాయణగుట్టకు వచ్చాడు. రాత్రి లోడు దించాలని నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం భోజనం చేసి క్లీనర్‌ సల్మాన్, అబ్దుల్‌ రయీస్‌లు క్యాబిన్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సుమారు 3.30 గంటల ప్రాంతంలో నంబరు ప్లేటు లేని ద్విచక్రవాహనంపై ముగ్గురు దుండగుల్లో ఒకరూ  అబ్దుల్‌ రయీస్‌ జేబులోని నగదు, చరవాణి లాక్కునేందుకు యత్నించగా ప్రతిఘటించాడు. కత్తితో ముఖంపై దాడిచేశాడు. అనంతరం మిగతా ఇద్దరితో యాక్టీవా వాహనంపై చాంద్రాయణగుట్ట చౌరస్తా వైపు పరారయ్యారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని