logo

ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ అధిరోహణ

హైదరాబాద్‌కు చెందిన యువ పర్వతారోహకులు నేపాల్‌లోని 5,364 మీటర్ల ఎత్తయిన ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ను బుధవారం అధిరోహించారు.

Published : 20 Jun 2024 01:28 IST

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన యువ పర్వతారోహకులు నేపాల్‌లోని 5,364 మీటర్ల ఎత్తయిన ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ను బుధవారం అధిరోహించారు. నగరానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి లట్టుపల్లి లలిత్యరెడ్డి, ఏడోతరగతి విద్యార్థి లట్టుపల్లి శ్రీహాన్‌రెడ్డి, ఇంటర్‌ విద్యార్థులు గోలి ప్రీతమ్, షామిన్‌ రమేష్‌ క్యాతిన్‌ మరికొందరితో కలిసి బేస్‌ క్యాంప్‌నకు చేరుకున్నారు. నాలుగు రోజులపాటు ఈ యాత్ర కొనసాగింది. ప్రముఖ పర్వతారోహకుడు సత్యరూప్‌ సిద్ధాంత పర్యవేక్షణలో వివిధ రాష్ట్రాలకు చెందిన పర్వతారోహకులతో వీరు బేస్‌ క్యాంప్‌ను అధిరోహించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని