logo

అయోమయ వాతావరణం

నగరంలో ఎప్పుడు, ఎక్కడ, ఎంత సమయం వర్షం పడుతుందనే ముందస్తు సమాచారం లభించట్లేదా..? వాతావరణశాఖ వివరాలను త్వరగా, కచ్చితంగా వెల్లడించట్లేదా..? వంటి ప్రశ్నలు నగరవాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Updated : 20 Jun 2024 04:26 IST

ఐఎండీ సమాచారంపై జీహెచ్‌ఎంసీ అసంతృప్తి

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో ఎప్పుడు, ఎక్కడ, ఎంత సమయం వర్షం పడుతుందనే ముందస్తు సమాచారం లభించట్లేదా..? వాతావరణశాఖ వివరాలను త్వరగా, కచ్చితంగా వెల్లడించట్లేదా..? వంటి ప్రశ్నలు నగరవాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. భారత వాతావరణశాఖ(ఐఎండీ), జీహెచ్‌ఎంసీ మధ్య సమాచార మార్పిడి సవ్యంగా ఉంటే  ప్రజలను అప్రమత్తం చేయొచ్చు.

ఇతర దేశాల్లో..: అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని నగరాల్లో చిన్న చిన్న ప్రాంతాలకు కూడా కచ్చితమైన వాతావరణ సమాచారం అందుతుందని, ఎక్కడ, ఎంత సమయం, ఎంత తీవ్రతతో వాన పడుతుందనే వివరాలను స్థానిక ప్రభుత్వం ఓ రోజు ముందే ప్రకటిస్తుందని బల్దియా చెబుతోంది. అలాంటి వాతావరణ సమాచార వ్యవస్థ హైదరాబాద్‌కు అవసరమని, ముందస్తుగా సహాయక చర్యల బృందాలను మొహరించి నష్టాన్ని నివారించగలమని విపత్తు స్పందన దళం అధికారులు అంటున్నారు.

ఇలా చేస్తే బాగు: నగరమంతా కొండలు, గుట్టలతో ఉంటుంది. కుండపోత వానలతో ఎగువ నుంచి వరదంతా దిగువనున్న కాలనీల్లోకి వస్తోంది. నగరవ్యాప్తంగా 125 చోట్ల చిన్నపాటి వానకే మోకాల్లోతు నీరు నిలుస్తోంది. ఆయా చోట్ల కురిసే వర్షం సమాచారాన్ని వాతావరణ శాఖ ఇస్తే మేలు జరుగుతుంది. 

వాతావరణశాఖ ఇస్తోన్న అంచనాలు 60-70శాతం మాత్రమే నిజమవుతున్నాయని జీహెచ్‌ఎంసీ అంచనా వేస్తోంది. 100శాతం కచ్చితత్వంతో సమాచారం ఇస్తే ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చేయొచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని