logo

ఐరాస పీస్‌ కీపింగ్‌ మిషన్‌ పరీక్ష.. 19 మంది ఉత్తీర్ణత

ఐక్యరాజ్యసమితి పీస్‌ కీపింగ్‌ మిషన్‌కు ఎంపిక చేసేందుకు నిర్వహించిన ప్రత్యేక పరీక్షలో తెలంగాణ పోలీసులు సత్తాచాటారు.

Published : 21 Jun 2024 04:15 IST

ఈనాడు- హైదరాబాద్‌: ఐక్యరాజ్యసమితి పీస్‌ కీపింగ్‌ మిషన్‌కు ఎంపిక చేసేందుకు నిర్వహించిన ప్రత్యేక పరీక్షలో తెలంగాణ పోలీసులు సత్తాచాటారు. ఎస్పీ, డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్‌ హోదాల్లో ఉన్న 19 మంది ఉత్తీర్ణులయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 225 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. 164 మంది ఉత్తీర్ణులయ్యారు. ఐక్యరాజ్య సమితి పీస్‌ కీపింగ్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా అంతర్గత సంక్షోభం ఎదుర్కొనే దేశాలకు ప్రత్యేక బలగాలను పంపిస్తుంది.జూన్‌ 6-15 తేదీల మధ్య దిల్లీలోని ఐటీబీపీ 22వ బెటాలియన్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 225 మంది పోలీసులకు పరీక్ష నిర్వహించారు. ఫైరింగ్, డ్రైవింగ్‌ సహా వివిధ భద్రతాపరమైన అంశాలపై న్యూయార్క్‌ వచ్చిన ఇద్దరు ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. ఇందులో 19 మంది అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ దేవేంద్రసింగ్, డీఎస్పీలు చల్లా శ్రీధర్, ప్రతాప్, జూపల్లి రమేశ్, మాజిద్‌ అలీఖాన్, శ్రీధర్‌రెడ్డి, కేఎం కిరణ్‌కుమార్, నర్సింగరావు, అలెక్స్, ఇన్‌స్పెక్టర్లు సురేశ్, విజయ్‌కుమార్, హెడ్‌కానిస్టేబుల్‌ యాదగిరి, శ్రీనివాసులు తదితరులు ఉత్తీర్ణులయ్యారు. ఐరాస కోరినప్పుడు కేంద్ర ప్రభుత్వం వీరిని ఆయా దేశాలకు పంపించనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు