logo

పట్టు పట్టాలి.. ప్రాజెక్టులు సాధించాలి

ప్రజారవాణాతోనే విశ్వనగర కీర్తి ముడిపడి ఉందని నమ్మిన పాలకులు, నగర అభివృద్ధి సంస్థలు అనేక ప్రణాళికలు చేశాయి.

Updated : 21 Jun 2024 06:46 IST

ప్రణాళికలకే పరిమితమైన రైల్వే స్టేషన్లు 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజారవాణాతోనే విశ్వనగర కీర్తి ముడిపడి ఉందని నమ్మిన పాలకులు, నగర అభివృద్ధి సంస్థలు అనేక ప్రణాళికలు చేశాయి. అందులో భాగంగానే మెట్రో రైలు అందుబాటులోకి వచ్చింది. నగరం నుంచి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులను కోసం శివార్లలో మరిన్ని రైల్వే స్టేషన్లు అవసరమని భావించారు. నిజాంల కాలం నుంచి ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడకు తోడు.. నలువైపులా రైల్వే స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించారు. తూర్పున చర్లపల్లి, పశ్చిమాన నాగులపల్లి, ఉత్తరాన మనోహరాబాద్, దక్షిణాన షాద్‌నగర్‌ స్టేషన్లను అభివృద్ధి చేస్తే.. ప్రయాణాలు సులభంగా సాగిపోతాయని భావించారు. కానీ వాటిని కార్యరూపం పెట్టడంలో విఫలమయ్యారు. 
ఇదే సరైన సమయం.. : హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ ఎంపీ స్థానాలు నగర పరిధిలోకి వస్తాయి. ఈ నియోజకవర్గాల పరిధిలోనే 4 రైల్వే స్టేషన్లున్నాయి. నగర పరిధిలోకి మెదక్‌ ఎంపీ సీటు కూడా వస్తుంది. మొత్తం 5 మంది ఎంపీలు రాజధానితో ముడిపడి ఉన్నారు. వీరు మిగతా 3 స్టేషన్ల గురించి పట్టు పట్టాల్సిన అవసరముంది. నగరం నలువైపులా 4 స్టేషన్ల నిర్మాణానికిగాను ఒక్క చర్లపల్లిలోనే పనులు పూర్తయ్యాయి. మిగతావాటి ప్రతిపాదనలు రైల్వే బోర్డు వద్ద లేవు.  అలాగే నగరంలో ఈ నాలుగింటిని కలుపుతూ ఎంఎంటీఎస్‌ రైళ్లు పెంచే అంశంపై ఎంపీలు పట్టుపట్టాలి. 

రీజినల్‌ రింగ్‌  రైల్వే లైన్‌ కోసం

నగరం నుంచి దూర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్లో 1.60 లక్షల మంది, రైళ్లలో 2.20 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. రైల్వే స్టేషన్‌కు వెళ్లి రైలు అందుకోవాలన్నా.. దూరప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎక్కాలన్నా.. నగరవాసులకు గగనంగా మారింది. నగరం నుంచి ఈ స్టేషన్లకు లోకల్‌ రైళ్లు, సిటీ బస్సుల ద్వారా చేరుకుని దూర ప్రాంతాలకు ప్రయాణాలు సులభంగా సాగించవచ్చు. రీజినల్‌ రింగు రోడ్డు వస్తున్న నేపథ్యంలో రీజినల్‌ రింగు రైల్వే లైనుకు బడ్జెట్‌లో ఆమోద ముద్రపడేలా చూడాల్సి ఉంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు