logo

సమాజ హితానికి అక్షరాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి రామోజీరావు

అక్షరాన్ని సమాజ హితానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా అన్నారు.

Published : 21 Jun 2024 04:43 IST

మాట్లాడుతున్న ఉప్పల శ్రీనివాస్‌గుప్తా 

నాగోలు, న్యూస్‌టుడే: అక్షరాన్ని సమాజ హితానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా అన్నారు. ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో గురువారం నాగోలు కోఆపరేటివ్‌ బ్యాంక్‌ కాలనీలో రామోజీరావు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గుప్తా మాట్లాడుతూ.. ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాన్ని నిర్భయంగా రాసిన వ్యక్తి రామోజీరావు అని అన్నారు. నైతిక విలువలకు పెద్ద పీట వేసి, వాటిని ఆచరించి చూపిన రామోజీరావు మృతి బాధాకరమన్నారు. సీనియర్‌ పాత్రికేయులు టి.ఉడయవర్లు ప్రసంగిస్తూ.. చేపట్టిన అన్ని రంగాల్లో విజయవంతమైన వ్యాపారదక్షుడు రామోజీరావు అన్నారు. వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. రామోజీరావు ఉద్యోగులకు క్రమశిక్షణతో పాటు నైతిక విలువలు నేర్పారన్నారు. సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, ఆకృతి సంస్థ ప్రతినిధి సుధాకర్, ఉప్పల స్వప్న, భాగ్యలక్ష్మి, మంజుల పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు