logo

ప్రభుత్వ కళాశాలలకు ప్రవేశాల కళ

ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలు కొత్త విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. పదోతరగతి ఫలితాలు రాకముందే ప్రవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో ముందస్తుగా ప్రవేశం

Published : 21 Jun 2024 05:12 IST

వందల సంఖ్యలో చేరుతున్న విద్యార్థులు
అతిథి అధ్యాపకుల నియామకం తప్పనిసరి

మహబూబియా కళాశాలలో విద్యార్థుల సందడి 

ఈనాడు,హైదరాబాద్‌: ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలు కొత్త విద్యార్థులతో కళకళలాడుతున్నాయి. పదోతరగతి ఫలితాలు రాకముందే ప్రవేటు, కార్పొరేట్‌ కళాశాలల్లో ముందస్తుగా ప్రవేశం ఖరారు చేసుకుంటున్న తల్లిదండ్రులకు భిన్నంగా కొందరు ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించేందుకు ఇష్టపడుతున్నారు. 
ఇక్కడిలా:  హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో గతేడాదితో పోలిస్తే ప్రవేశాల సంఖ్య భారీగా పెరిగింది. హైదరాబాద్‌ జిల్లాలో 22 ప్రభుత్వ కళాశాలల్లో గతేడాది 8వేల మందికిపైగా విద్యార్థులు చేరగా... ఈ ఏడాది జూన్‌ మొదటివారంలోనే 6వేల మందికిపైగా దరఖాస్తులు సమర్పించారు. రెండేళ్ల నుంచి ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు వేగంగా పెరుగుతున్నాయని హైదరాబాద్‌ జిల్లా ఇంటర్‌బోర్డు అధికారి దాసరి ఒడ్డెన్న తెలిపారు. మౌలిక సదుపాయాలతో పాటు ప్రయోగశాలలు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని న్నారు. 
ప్రైవేటు, కార్పొరేటు జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియేట్‌ చదివించేందుకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించాల్సి వస్తుండటంతో చాలామంది ప్రభుత్వ కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.

నాణ్యమైన బోధన

 ప్రభుత్వ అధ్యాపకులతో నాణ్యమైన బోధన సాధ్యమవుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 49 జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఉంది. నియామకాలు చేపట్టకపోవడంతో ఏటా అతిథి అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారు. నిధుల కొరతతో ఈ విద్యా సంవత్సరంలో నియమించలేదు. ఉన్నతాధికారులు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లుంటే కొంతైనా పరిష్కారం లభించేదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని