logo

మితిమీరిన వేగం ప్రాణం తీసింది

మితిమీరిన వేగం.. త్రిపుల్‌ రైడింగ్‌ కారణంగా ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు.

Published : 22 Jun 2024 01:32 IST

పాతబస్తీలో ఇద్దరు యువకుల దుర్మరణం 

ఠాకూర్‌  రాధాకిషన్‌           వైజనాథ్‌ ఇంగ్లే 

చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: మితిమీరిన వేగం.. త్రిపుల్‌ రైడింగ్‌ కారణంగా ఇద్దరు యువకులు దుర్మరణం చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. ఈ విషాదకర ఘటన శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ ఛత్రినాక ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై శోభ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రినాక జయప్రకాశ్‌నగర్‌కు చెందిన ఏసీ మెకానిక్‌ ఠాకూర్‌ రాధాకిషన్‌ అలియాస్‌ రోహిత్‌(24) గురువారం అర్ధరాత్రి తరువాత తన స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు వెళ్తున్నానని చెప్పి ఛత్రినాకకు చెందిన రోహన్‌ చౌకాట్‌ వద్ద ద్విచక్రవాహనం తీసుకున్నాడు. తన మిత్రులు ఛత్రినాక రామస్వామిగంజ్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి వైజనాథ్‌ ఇంగ్లే అలియాస్‌ సోను(30), ఛత్రినాక శివపార్వతీనగర్‌కు చెందిన విద్యార్థి కె.నిఖిల్‌కుమార్‌(18)తో కలిసి బైకుపై చాంద్రాయణగుట్ట వెళ్లారు. అక్కడ మండీ హౌజ్‌లో భోజనం చేసిన తరువాత వారు తిరిగి ఇంటికి బయలుదేరారు. బైకును రాధాకిషన్‌ నడుపుతుండగా మధ్యలో వైజనాథ్‌ ఇంగ్లే, వెనుక నిఖిల్‌కుమార్‌ కూర్చుని వేగంగా దూసుకు వెళుతుండగా కందికల్‌ ఆర్‌ఓబీ మీద బైకు అదుపు తప్పి డివైడర్‌ను, విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టి కింద పడిపోయారు. ఘటనలో వైజనాథ్‌ ఇంగ్లే అక్కడికక్కడే మృతి చెందగా రాధాకిషన్‌ తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. నిఖిల్‌ కుమార్‌కు నడుముకు గాయాలయ్యాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు