logo

పేటీఎం రుణం చెల్లించాలంటూ కత్తితో బెదిరించిన ఏజెంట్లు

పేటీఎం ఏజెంట్లు.. ఇద్దరు వ్యక్తులను బెదిరించిన సంఘటన మీర్‌పేట ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కాశీ విశ్వనాథ్‌ కథనం ప్రకారం... గుర్రంగూడకు చెందిన ఇరుగండ్ల అశోక్, డేవిడ్‌.. బడంగ్‌పేటలో సెకండ్‌ హోమ్‌ బేకరీ నడుపుతున్నారు.

Published : 22 Jun 2024 01:59 IST

పేటీఎం రుణం చెల్లించాలంటూ కత్తితో బెదిరించిన ఏజెంట్లు 

బాలాపూర్, న్యూస్‌టుడే: పేటీఎం ఏజెంట్లు.. ఇద్దరు వ్యక్తులను బెదిరించిన సంఘటన మీర్‌పేట ఠాణా పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కాశీ విశ్వనాథ్‌ కథనం ప్రకారం... గుర్రంగూడకు చెందిన ఇరుగండ్ల అశోక్, డేవిడ్‌.. బడంగ్‌పేటలో సెకండ్‌ హోమ్‌ బేకరీ నడుపుతున్నారు. బేకరీ అభివృద్ధికి పేటీఎంలో రూ.6 లక్షల రుణం తీసుకొని వాయిదాల్లో రూ.1.60 లక్షలు చెల్లించారు. బేకరీలో నష్టం రావడంతో రుణం చెల్లించలేకపోయారు. శుక్రవారం డేవిడ్, అశోక్‌లు  బడంగ్‌పేటలోని ఓ రెస్టారెంట్‌లో ఉండగా.. పేటీఎం రికవరీ ఏజెంట్లు వచ్చి కత్తితో బెదిరించి పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని