logo

పాతబస్తీలో అదృశ్యం.. కర్ణాటకలో హత్య

పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు కర్ణాటకలో హత్యకు గురయ్యాడు. భవానీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలో పెయింటర్‌గా పనిచేసే మహ్మద్‌ సల్మాన్‌ షరీఫ్‌(26) బార్కాస్‌లోని తన సోదరుడు మహ్మద్‌ ఫెర్రోజ్‌ షరీఫ్‌(36) నివాసంలో ఉంటున్నాడు.

Updated : 22 Jun 2024 04:01 IST

చార్మినార్, న్యూస్‌టుడే: పాతబస్తీలో అదృశ్యమైన యువకుడు కర్ణాటకలో హత్యకు గురయ్యాడు. భవానీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలో పెయింటర్‌గా పనిచేసే మహ్మద్‌ సల్మాన్‌ షరీఫ్‌(26) బార్కాస్‌లోని తన సోదరుడు మహ్మద్‌ ఫెర్రోజ్‌ షరీఫ్‌(36) నివాసంలో ఉంటున్నాడు. ఫెర్రోజ్‌ భార్య రజియాసుల్తానా(30)ను బెదిరించి ఆమెతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెకు ఇద్దరు సంతానం. వారిలో ఓ కుమారుడిని కర్ణాటకలో తన మేనబావ ఇలాహీ(40) ప్రాంతంలోని మదర్సాలో చదివిస్తోంది. తనను మరిది సల్మాన్‌ షరీఫ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని మేనబావకు చెప్పగా.. హత్య చేయడానికి ఇద్దరు పథకం వేశారు. ఈ నెల 10న రజియాసుల్తానా, సల్మాన్‌ షరీఫ్‌ గుల్బర్గాలోని కుమారుడిని చూడడానికి వెళ్లారు. ఆమె మేనబావ అక్కడికి వచ్చారు. సల్మాన్‌ షరీఫ్‌ను తన మేనబావతో కారులో వెళ్లిరమ్మని పంపించింది. కొంతదూరం వెళ్లాక మధ్యలో తన ముగ్గురు మిత్రులతో కలిసి ఇలాహీ అతని మెడకు తాడుతో ఉరివేసి హత్య చేసి సమీపంలోని రిజర్వాయర్‌లో పడేశాడు. రజియాసుల్తానా ఈ నెల 14న తిరిగి హైదరాబాద్‌ చేరుకుంది. సల్మాన్‌ షరీఫ్‌ తప్పిపోయాడని.. అదే రోజు సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు యువకుడి ఫోన్‌ లోకేషన్‌తో పాటు కాల్‌డేటా ఆధారంగా కర్ణాటకకు వెళ్లిన అనంతరం అతను వెళ్లాడని, అక్కడ హత్యకు గురయ్యాడని గుర్తించారు. రజియాసుల్తానా, ఇలాహీని అదుపులోకి తీసుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని