logo

జులై మొదటి వారంలో హైదరాబాద్‌లో అన్న క్యాంటీన్‌ సేవలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రికైన  అన్న క్యాంటీన్‌ను హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు సీబీఎన్‌ ఫోరం వ్యవస్థాపకులు జెనెక్స్‌ అమర్‌ తెలిపారు. మాదాపూర్‌ 100 ఫీట్‌ రోడ్డులో క్యాంటీన్‌ నిర్మాణ పనులు పూర్తి కావడంతో శనివారం సాయంత్రం జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

Published : 23 Jun 2024 05:36 IST

జ్యోతి వెలిగించి క్యాంటీన్‌ ప్రారంభిస్తున్న అమర్‌ 

మాదాపూర్, న్యూస్‌టుడే: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రికైన  అన్న క్యాంటీన్‌ను హైటెక్‌ సిటీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు సీబీఎన్‌ ఫోరం వ్యవస్థాపకులు జెనెక్స్‌ అమర్‌ తెలిపారు. మాదాపూర్‌ 100 ఫీట్‌ రోడ్డులో క్యాంటీన్‌ నిర్మాణ పనులు పూర్తి కావడంతో శనివారం సాయంత్రం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అమర్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లు ఎందరో పేదల ఆకలి తీర్చి వారి ఆదరణ పొందాయన్నారు. చంద్రబాబు స్ఫూర్తితో తెలంగాణలో సైతం అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. జులై మొదటి వారంలో రోజూ పేదలకు ఉచితంగా భోజనం అందించనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో చంద్రబాబు ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు సీబీఎన్‌ ఫోరం తరఫున కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు చిత్రపటానికి ఫోరం సభ్యులు నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, ఫోరం సభ్యులు లలిత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని