logo

మీ ప్రాంతానికే వచ్చి బంగారం కొనుగోలు

ఆయా కుటుంబాల ఆర్థిక అవసరాలను తీర్చే ఉద్దేశంతో వారు అమ్మాలనుకున్న బంగారాన్ని వారి ప్రాంతానికే వచ్చి కొనుగోలు చేసే సంచార వాహనాన్ని వాల్యూ గోల్డ్‌ సంస్థ ప్రారంభించింది.

Published : 23 Jun 2024 01:59 IST

వాహనాన్ని ప్రారంభించిన సినీ నటి అనసూయ, సంస్థ నిర్వాహకులు వెంకటేష్‌ చందా, అభిషేక్‌ చందా, శ్రీనివాస్, భరద్వాజ్‌

అమీర్‌పేట, న్యూస్‌టుడే: ఆయా కుటుంబాల ఆర్థిక అవసరాలను తీర్చే ఉద్దేశంతో వారు అమ్మాలనుకున్న బంగారాన్ని వారి ప్రాంతానికే వచ్చి కొనుగోలు చేసే సంచార వాహనాన్ని వాల్యూ గోల్డ్‌ సంస్థ ప్రారంభించింది. అమీర్‌పేటలోని సారథి స్టూడియోస్‌లో శనివారం సంస్థ ప్రచారకర్త, సినీనటి అనసూయ దీన్ని ప్రారంభించారు. సంస్థ డైరెక్టర్‌ అభిషేక్‌ చందా మాట్లాడుతూ బంగారం కొనుగోలు చేసేందుకు ఈ తరహా వాహనాన్ని ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారన్నారు. వాహనం ద్వారా బంగారానికి అక్కడికక్కడే స్వచ్ఛత పరీక్ష నిర్వహించడంతోపాటు అమ్మకందారులు నష్టపోకుండా ధర నిర్ణయించి అందజేస్తామన్నారు. బంగారం కొనడంతోపాటు తనఖా పెట్టిన బంగారాన్ని విడిపించడం, బంగారు, వెండి నాణేల అమ్మకాలు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో కొత్తగా అయిదో  వాల్యూ గోల్డ్‌ షోరూంను ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వెంకటేష్‌ చందా, సీఈవో భరద్వాజ్‌ పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని