logo

అనుమతి లేని పరుగు

తెలంగాణకు సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌తో నగరంలో విచ్చలవిడిగా వాహనాలు తిరుగుతున్నాయి. పన్ను ఎగవేస్తున్నాయి. ఇక ముందు ఇతర రాష్ట్రాల వాహనాలు తిరిగే అవకాశం ఉండదు.

Published : 23 Jun 2024 02:02 IST

గ్రేటర్‌లో తిరుగుతున్న పక్క రాష్ట్రాల వాహనాలు 
పన్ను ఎగవేత.. భారీగా ఆదాయానికి గండి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణకు సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌తో నగరంలో విచ్చలవిడిగా వాహనాలు తిరుగుతున్నాయి. పన్ను ఎగవేస్తున్నాయి. ఇక ముందు ఇతర రాష్ట్రాల వాహనాలు తిరిగే అవకాశం ఉండదు. అనుమతి లేని అన్ని రకాల వాహనాలను పట్టుకోవడానికి రవాణాశాఖ సిద్ధమవుతోంది.

నిబంధనల ప్రకారం: తెలంగాణేతర వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పుడు కేవలం నెల రోజులు మాత్రమే ఇక్కడ తిరగడానికి అవకాశం ఉంది. ఆసుపత్రుల సేవలు, పర్యాటకం ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని రవాణాశాఖ ఈ వెసులుబాటు కల్పించింది. 

అంతా ఉల్లంఘనే: చాలా వాహనాలు ఏళ్ల తరబడి ఇక్కడ తిరుగుతున్నాయి. కొన్నింటికి రాజకీయ నేపథ్యం ఉండటం కూడా ఎవరూ ఇన్నాళ్లు పట్టించుకోలేదు. దీంతో పెద్దఎత్తున జీవితకాల పన్నును ఆర్టీఏ కోల్పోతోంది. గ్రేటర్‌లో 80 లక్షల వాహనాలు ఉండగా...ఇందులో బైక్‌లు, కార్లు లక్షన్నర పైనే ఉన్నాయి. ఇక్కడే తప్పనిసరిగా ఉండాలనుకుంటే జీవితకాల పన్ను చెల్లించాలి. ఆయా రాష్ట్రాల నుంచి ఎన్‌వోసీ తెచ్చుకొని.. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే టీజీ కోడ్‌తో రిజిస్ట్రేషన్‌ నెంబరు కేటాయిస్తారు. పన్ను చెల్లించకుండానే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో ఇక్కడే తిప్పుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు