logo

టీజీఎస్పీడీసీఎల్‌ నుంచి మరో యాప్‌

దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌) మరో యాప్‌ (గిబితిఖిలీళ్శీ ను రూపొందించింది. లక్షల ట్రాన్స్‌ఫార్మర్లు, ఉన్న విద్యుత్తు తీగలు, పరికరాలు ఇలా ప్రతిదీ ఏ దశలో ఉంది..?

Published : 23 Jun 2024 02:03 IST

ఈనాడు, హైదరాబాద్‌ : దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్‌) మరో యాప్‌ (గిబితిఖిలీళ్శీ ను రూపొందించింది. లక్షల ట్రాన్స్‌ఫార్మర్లు, ఉన్న విద్యుత్తు తీగలు, పరికరాలు ఇలా ప్రతిదీ ఏ దశలో ఉంది..? ఎలా పనిచేస్తుంది అనే వివరాలను ఈ యాప్‌లో రికార్డు చేయబోతున్నారు. ఇప్పటికే మేడ్చల్‌ డివిజన్‌లో ప్రయోగాత్మకంగా నమోదు ప్రక్రియను చేపట్టారు. 

రేపటి నుంచి సర్వే...: విద్యుత్తు లైన్ల సర్వే పనులకు సోమవారం నుంచి అధికారికంగా ప్రారంభిస్తున్నట్లు టీజీఎస్పీడీసీఎల్‌ మేడ్చల్‌ డివిజన్‌ డీఈ శ్రీనాథ్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సర్వే మొదలవుతుందని పేర్కొన్నారు. తమ డివిజన్‌ పరిధిలో 12 బృందాలు సర్వేలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఏఈ, సిబ్బంది ఒక బృందంగా, సబ్‌ ఇంజినీర్, సిబ్బంది మరో బృందంగా క్షేత్రస్థాయిలో అన్ని అంశాలపై సర్వే చేయనున్నారన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని