logo

బాలికను బెదిరించి చిన్నాన్న అత్యాచారం

అనారోగ్యంతో ఇంటి పెద్ద మరణంతో పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతున్న ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన చిన్నాన్నే బాలిక పాలిట క్రూరమృగంలా మారాడు. ఒంటరిగా ఉన్న బాలిక(14)ను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.

Published : 23 Jun 2024 02:04 IST

నిందితుడిపై పోక్సో కేసు నమోదు

శంషాబాద్, న్యూస్‌టుడే: అనారోగ్యంతో ఇంటి పెద్ద మరణంతో పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతున్న ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన చిన్నాన్నే బాలిక పాలిట క్రూరమృగంలా మారాడు. ఒంటరిగా ఉన్న బాలిక(14)ను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. శంషాబాద్‌లో ఈ నెల 20న ఈ సంఘటన జరిగింది.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌కు చెందిన దంపతులు రోజువారీ కూలీలు. అనారోగ్యం బారిన పడ్డ భర్త రెండు నెలల క్రితం మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భార్య  పనుల కోసం బయటకు వెళ్లింది. గురువారం యాకేశ్‌ ఒంటరిగా ఉన్న బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని