logo

సరిహద్దు సమస్యలు పరిష్కరించుకుందాం..!

హైదరాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ భూములు, రక్షణశాఖ భూముల సరిహద్దుల నిర్ణయంలో ఉత్పన్నమవుతున్న వివాదాలను పరిష్కరించుకునేందుకు హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి చొరవ తీసుకున్నారు.

Updated : 23 Jun 2024 05:09 IST

సంయుక్త సర్వేకు రక్షణశాఖ, రెవెన్యూ అధికారుల నిర్ణయం

ఈనాడు,హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ భూములు, రక్షణశాఖ భూముల సరిహద్దుల నిర్ణయంలో ఉత్పన్నమవుతున్న వివాదాలను పరిష్కరించుకునేందుకు హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి చొరవ తీసుకున్నారు. రక్షణ శాఖ అధికారులు, బ్రిగేడియర్‌ సోమశంకర్‌ ఎస్‌.ఎంలతో కలిసి కంటోన్మెంట్‌ కార్యాలయంలోని సమావేశ భవనంలో శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో వీటిని పరిశీలించి సరిహద్దులు నిర్ణయించేందుకు రెవెన్యూ, రక్షణ శాఖ అధికారులు కలిసి సంయుక్తంగా సర్వే నిర్వహిద్దామని ప్రతిపాదించారు. గోల్కొండ, ఆసిఫ్‌నగర్‌ మండలాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలు అక్కడి ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నారు. క్రమంగా ఇళ్లు కట్టుకున్నారు. వీటిని క్రమబద్దీకరించాలంటూ నాలుగు వందల కుటుంబాలకు పైగా రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులపై ప్రత్యేకంగా రక్షణశాఖ అధికారులతో అనుదీప్‌ దురిశెట్టి చర్చించారు. 

ఆరు అంశాలపైనే చర్చ... 

కంటోన్మెంట్, తిరుమలగిరి, ఆసిఫ్‌నగర్, కంచన్‌బాగ్‌ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూములు, ఆక్రమించుకున్న స్థలాలపై సమాచారాన్ని సేకరించిన అధికారులు  వాటిని ఆరు అంశాలుగా రూపొందించి చర్చించారు. రక్షణశాఖకు చెందిన భూములను ఎవరైనా ఆక్రమించుకుంటే వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా రక్షణశాఖ అధికారులకు రెవెన్యూ అధికారులు సహకరించనున్నారు. సైనిక స్కూల్‌కు కేటాయించిన భూములను రెవెన్యూ అధికారులు రక్షణశాఖకు అప్పగించేందుకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని