logo

చెరువులకు సొబగులు

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని చెరువులు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. విడతల వారీగా అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Updated : 23 Jun 2024 05:09 IST

మరో 45 తటాకాలసుందరీకరణకు ప్రణాళిక
సుమారు రూ.22 కోట్లు వెచ్చించనున్న హెచ్‌ఎండీఏ

కూకట్‌పల్లి ప్రాంతంలోని అంబీర్‌ చెరువు 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలోని చెరువులు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. విడతల వారీగా అభివృద్ధి చేసేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇది వరకే 15 చెరువులను ఎంపిక చేసి కొన్ని పనులు చేపట్టింది. తాజాగా ఏడు జిల్లాల పరిధిలో మరో 45 చెరువులను అభివృద్ధి చేసేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది. హెచ్‌ఎండీఏ పరిధిలోని అనేక చెరువు ఆక్రమణలు...కలుషిత జలాలు...పూడికతో నిండిపోయాయి. బల్డియా వరకు 160 వరకు చెరువులుంటే దాదాపుగా అన్నింటివీ ఇదే పరిస్థితి. ఈ పరిస్థితిపై ఇటీవల హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇందులో భాగంగా హెచ్‌ఎండీఏ పరిధిలోని తొలి విడతలో కొన్ని చెరువుల పునరుద్ధరణకు హెచ్‌ఎండీఏ పూనుకుంది. ఇందుకోసం రూ.22 కోట్లు వరకు వెచ్చించనుంది. 

ఏం చేస్తారంటే...

  • హెచ్‌ఎండీఏ విస్తరించి ఉన్న ఏడు జిల్లాల పరిధిలో 3532 చెరువులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 3 వేల చెరువులకు ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌(ఎఫ్‌టీఎల్‌)ను నిర్ధారించారు. చాలాచోట్ల ఎఫ్‌టీఎల్‌ పూర్తిగా ఆక్రమణలకు గురైంది.
  • పునరుద్ధరణలో భాగంగా ఎఫ్‌టీఎల్‌ పరిధి వరకు మార్కింగ్‌ ఇస్తారు. అక్రమ నిర్మాణాలుంటే కూల్చేస్తారు. భవిష్యత్తులో అక్కడ కట్టడాలు లేకుండా చర్యలు తీసుకుంటారు. లేఅవుట్లు రాకుండా హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేస్తారు.
  • సుందరీకరణలో భాగంగా చెరువుల కట్టలను బలోపేతం చేసి... లోనికి నీళ్లు వచ్చే కాల్వలను శుభ్రం చేయనున్నారు. చెరువుపై వాకింగ్‌ ట్రాక్‌లు, పూలు, ఆర్నమెంట్‌ మొక్కలు పెంచి చుట్టూ గార్డెనింగ్‌ అభివృద్ధి చేస్తారు. స్థలం ఉంటే అక్కడ పార్కులను అభివృద్ధి చేయనున్నారు.
  • ఇందులో స్థానికులను కూడా భాగస్వామం చేయనున్నారు. ఫలితంగా పట్టణాలు, కాలనీలకు చెరువులకు మధ్య కంచె నిర్మించి లోపల అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చూస్తారు.
  • పట్టణాలు, గ్రామాలకు, రహదారులకు పక్కన చెరువులు ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉండటంతో తొలుత అక్కడ చర్యలు చేపడతారు. 

ఏడు జిల్లాల పరిధిలో చెరువుల సంఖ్య ఇలా...

హైదరాబాద్‌  28

రంగారెడ్డి 1078

మేడ్చల్‌ 620

మెదక్‌ 589

సంగారెడ్డి 603

సిద్ధిపేట: 347

యాదాద్రి  267 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని