logo

చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలతో ఉపాధి సృష్టించాలి: ఎంపీ

భారీ పరిశ్రమలు నెలకొల్పుతున్నా కనీసం వెయ్యి మందికి ఉపాధి కల్పించలేని పరిస్థితి కనిపిస్తోందని పార్లమెంట్‌ సభ్యుడు, పారిశ్రామికవేత్త కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.

Published : 24 Jun 2024 02:34 IST

ప్రసంగిస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, చిత్రంలో  సుందరం, విజయేంద్రప్రసాద్, అన్నదానం సుబ్రహ్మణ్యం

నారాయణగూడ, న్యూస్‌టుడే: భారీ పరిశ్రమలు నెలకొల్పుతున్నా కనీసం వెయ్యి మందికి ఉపాధి కల్పించలేని పరిస్థితి కనిపిస్తోందని పార్లమెంట్‌ సభ్యుడు, పారిశ్రామికవేత్త కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలోనూ ఇదే పంథా కొనసాగుతోందన్నారు. ఆదివారం నారాయణగూడలోని కేఎంఐటీ సభా మందిరంలో ‘స్వదేశీ స్వావలంబన భారత్‌ అభియాన్‌’ రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. చిన్న, సూక్ష్మతరహా పరిశ్రమలు నెలకొల్పితే ఉపాధి సృష్టించగలమన్నారు. సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ‘చదువుతూ సంపాదించు’ అనే నినాదంతో పిల్లలను స్వయం ఉపాధి వైపు దృష్టి మరల్చే ప్రయత్నాలు జరగాలన్నారు. అఖిల భారత స్వదేశీ జాగరణ మంచ్‌ కన్వీనర్‌ ఆర్‌.సుందరం, రాష్ట్ర సభల కన్వీనర్‌ బొల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి, తెలంగాణ, ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్‌ శ్రీనాథ్, తెలంగాణ ప్రాంత ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకారిణి సభ్యుడు అన్నదానం సుబ్రహ్మణ్యం, అసు యంత్రం సృష్టికర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశం, ఆర్‌ఎస్‌ఎస్‌ దక్షిణ మధ్య సహ క్షేత్ర ప్రచారక్‌ భరత్‌కుమార్, దక్షిణ భారత క్షేత్ర సంయోజక్‌ జగదీష్, సహా సంయోజక్‌ సత్తు లింగమూర్తి, బ్యాంకింగ్‌ రంగ నిపుణులు సుధాకర్‌ గందేజీ,  మంచ్‌ రాష్ట్ర సంయోజక్‌ ముక్కా హరీష్‌ బాబు, సహ సంయోజక్‌ గోటూరి రమేష్‌ గౌడ్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని