logo

లాడ్జిలో దంపతుల ఆత్మహత్యాయత్నం

ఆర్థిక ఇబ్బందుల కారణంగా లాడ్జిలో దంపతులు నిద్రమాత్రలు మిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడు. సెక్రటేరియట్‌ పోలీసుల కథనం ప్రకారం..

Published : 24 Jun 2024 02:36 IST

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి 

రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందుల కారణంగా లాడ్జిలో దంపతులు నిద్రమాత్రలు మిగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడు. సెక్రటేరియట్‌ పోలీసుల కథనం ప్రకారం... విశాఖపట్నానికి చెందిన రవీంద్రకుమార్‌ (56), రాఖి (49)లు భార్యాభర్తలు. వీరు ఎల్‌బీనగర్‌లో నివాసం ఉంటున్నారు. భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తూ.. వివిధ నగరాలకు తిరుగుతుండేవాడు. కొన్నాళ్లుగా ఉద్యోగం కూడా చేయకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. వీరు ఈనెల 20న మధ్యాహ్నం సికింద్రాబాద్‌కు వచ్చి రాణిగంజ్‌ ప్రాంతంలోని వసుంధర లాడ్జిలో గదిలో దిగారు. మరుసటి రోజు 21న రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 22న ఉదయం లాడ్జి బాయ్‌ వెళ్లి డోర్‌ కొట్టగా తీయకపోవడంతో యజమానికి, పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి తలుపు తీసి వెంటనే దంపతులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవీంద్రకుమార్‌ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని