logo

ఆదర్శప్రాయుడు రామోజీరావు

జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా తాను ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విజయం సాధించిన పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీరావును ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని శేరిలింగంపల్లి

Updated : 24 Jun 2024 03:19 IST

రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, బండి రమేష్‌ తదితరులు 

మియాపూర్, న్యూస్‌టుడే: జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నా తాను ఎంచుకున్న ప్రతి రంగంలోనూ విజయం సాధించిన పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత చెరుకూరి రామోజీరావును ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, రాష్ట్ర కమ్మ సంఘ అధ్యక్షుడు అరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్‌లో ఆదివారం పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, మియాపూర్, బీహెచ్‌ఈఎల్‌ కమ్మ సంఘం ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే తన సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కల్పించిన ఘనత రామోజీరావుకు దక్కుతుందన్నారు. దేశానికే అన్నం పెట్టే రైతులకు అన్నివిధాలా చేదోడువాదోడుగా ఉంటూ వారికి సలహాలు ఇచ్చేందుకు అన్నదాత పత్రికను స్థాపించి కోట్లాదిమంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.  రామోజీ ఫిలిం సిటీని నిర్మించి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. కాంగ్రెస్‌ కూకట్‌పల్లి నియోజకవర్గ బాధ్యుడు బండి రమేష్, విజేత సూపర్‌ మార్కెట్స్‌ ఎండీ ఎం జగన్‌మోహన్‌రావు, ఆయన స్నేహితులు అడప రామారావు, సూర్యనారాయణ, నరేంద్ర ప్రసాద్, కర్లపూడి రాఘవేంద్రరావు తదితరులు..  రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని  తీర్మానిస్తున్నట్లు ప్రకటించారు.   కమ్మ సంఘ అధ్యక్షుడు తాళ్లూరి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కొల్లి వెంకటేశ్వరరావు, కోశాధికారి పాపారావు, మియాపూర్‌ కార్పొరేటర్‌ ఉప్పలపాటి శ్రీకాంత్, కేబీవీ సుబ్బారావు, మండవ వేణు తదితరులు పాల్గొన్నారు.

భరత్‌నగర్‌లో నివాళి అర్పిస్తున్న ‘గుడ్‌ మార్నింగ్‌ వాకర్స్‌ అసోసియేషన్‌’ సభ్యులు

ఆయన స్ఫూర్తిప్రదాత 

మూసాపేట, న్యూస్‌టుడే: రామోజీరావు స్ఫూర్తిప్రదాతగా వెలుగొందుతారని వక్తలు పేర్కొన్నారు. ‘గుడ్‌ మార్నింగ్‌ వాకర్స్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో భరత్‌నగర్‌ కాలనీలో రామోజీరావు సంస్మరణ ఆదివారం జరిగింది. అసోసియేషన్‌ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి మాట్లాడుతూ మీడియా రంగంలో ఎవరూ చేయలేని ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంకటేశ్వర్లు, బుచ్చిబాబు, నాగేశ్వరరావు, చారి, శ్రీనివాస్‌రెడ్డి, సంతోష్‌కుమార్, దామోదర్‌ నాయుడు, రవీందర్, కృష్ణయ్య పాల్గొన్నారు.

వన్‌ కె రన్‌ పోటీల్లో బహుమతులు అందుకున్న విద్యార్థులతో నిర్వాహకులు 

జ్ఞాపకార్థం 1కె రన్‌

వెంగళ్‌రావునగర్, న్యూస్‌టుడే: రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జ్ఞాపకార్థం కళ్లెం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల విద్యార్థులకు మూడు విభాగాల్లో 1కె రన్‌ పోటీలు నిర్వహించారు.  కార్యక్రమంలో కల్యాణ్‌నగర్‌-3 కాలనీ అధ్యక్షుడు నరసింహారావు, కోచ్‌ అనిల్‌ తయ్యప్ప, లయన్‌ రాజశేఖర్, సర్వేశ్వర్, సుబ్రహ్మణ్యం రాజు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని