logo

ఫుట్‌బోర్డు ప్రయాణాలపై ఆర్టీసీ నజర్‌

టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఫుట్‌బోర్డు ప్రయాణాలతో ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించింది. బస్సు ఆగాక దిగాలని, ఎక్కాలని సూచించింది.

Published : 24 Jun 2024 03:14 IST

ఈనాడు-హైదరాబాద్‌: టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఫుట్‌బోర్డు ప్రయాణాలతో ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించింది. బస్సు ఆగాక దిగాలని, ఎక్కాలని సూచించింది. విద్యార్థులు భద్రమైన ప్రయాణం సాగేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు తనిఖీ బృందాలను రంగంలోకి దింపింది. సికింద్రాబాద్‌ రీజియన్‌ నుంచి తొలుత ప్రారంభించింది. ఈ సిబ్బంది ముఖ్యమైన బస్టాపుల్లో..రద్దీ ప్రాంతాల్లో ఉండి ప్రయాణికులు బస్సులె ఎక్కడం, దిగడాన్ని గమనిస్తారు. దారి మధ్యలో నూ పరిశీలిస్తారు. డ్రైవర్, కండక్టర్లను పూర్తి బాధ్యులను చేసి ఫుట్‌బోర్డు ప్రయాణాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతానికి అవగాహన కల్పించే పనిలో నిమగ్నమైంది. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు మార్గదర్శకాలు సూచించింది. వాటిని తప్పకుండా పాటించాలని.. లేని పక్షంలో చర్యలుంటాయని హెచ్చరించింది. 

ప్రయాణికులకు జాగ్రత్తలు..

  • ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుట్‌బోర్డు ప్రయాణం చేయవద్దు.
  • స్టాపుల్లో అడ్డంగా నిలబడి బస్సుల కోసం ఎదురు చూడొద్దు.
  • బస్సులు మలుపు తిరుగుతున్నప్పుడు బస్సులకు దగ్గరగా నిల్చోరాదు. అలాగే కదులుతున్న బస్సుల నుంచి దిగడం, ఎక్కడం చేయరాదు.
  • బస్సు స్టాపులో నిర్దేశించిన బస్సు బేలో ఆగే వరకు ప్రయాణికులు నిరీక్షించాలి.. బస్సులకు అడ్డంగా పరుగులు పెట్టి వెళ్లి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు.
  • డ్రైవర్‌కు బస్సు బేలో బస్సు ఆపేందుకు సమయం ఇవ్వాలి. సీటు దొరకదని బస్సు ఆగకముందే ఎక్కవద్దు.
  • ఒకవేళ ఎక్కడైనా ప్రయాణికులు దిగాలనుకుంటే.. బస్సు డ్రైవర్, కండక్టర్‌కు చెప్పి సురక్షితమైన ప్రాంతంలో ఆపిన తర్వాతే దిగాలి.
  • బస్సు నిండిపోయినప్పుడు తర్వాత వచ్చే బస్సు కోసం ఎదురు చూడాలి.మరో రెండు స్టాపుల్లో దిగిపోతారులేనని ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ఉండకూడదు.
  • డ్రైవర్, కండక్టర్‌ కూడా బస్సు స్టాపుల్లో విధిగా ఆపాలి. ప్రయాణికులు దిగినప్పుడు, ఎక్కిన తర్వాత కండక్టర్‌ సూచనల మేరకే బస్సును ముందుకు పోనివ్వాలి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు