logo

ఇలా జూబ్లీహిల్స్‌లో చేయగలరా: ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ

‘నో ఫ్రెండ్లీ పోలీస్, లాఠీఛార్జి పోలీస్‌’ అంటూ నగరంలో నేరాల కట్టడికి ఒక ఠాణా పరిధిలో పోలీసులు చేసిన ప్రకటన వివాదం రేకెత్తించింది.

Published : 25 Jun 2024 05:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: ‘నో ఫ్రెండ్లీ పోలీస్, లాఠీఛార్జి పోలీస్‌’ అంటూ నగరంలో నేరాల కట్టడికి ఒక ఠాణా పరిధిలో పోలీసులు చేసిన ప్రకటన వివాదం రేకెత్తించింది. దీనిపై సోమవారం హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఎక్స్‌(ట్వీట్టర్‌) ద్వారా స్పందించారు. నగరంలో శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసు యంత్రాంగం ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి  ఒక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రోడ్లపైకి చేరి వాహనాలతో బెంబేలెత్తిస్తున్న గుంపును ఉద్దేశించి ‘నో ఫ్రెండ్లీ పోలీస్, లాఠీఛార్జి పోలీస్‌’ అంటూ పోలీసులు మైక్‌ ద్వారా హెచ్చరించారు. ఈ వీడియోను ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఎక్స్‌లో పోస్టు చేశారు.  ఇలా జూబ్లీహిల్స్‌లో చేయగలరా! అని ప్రశ్నించారు. ఇతర మెట్రో నగరాల మాదిరి ఇరానీ ఛాయ్‌ హోటళ్లు, పాన్‌దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కార్యకలాపాలను అర్ధరాత్రి 12 గంటల వరకూ తెరచి ఉంచేలా అనుమతించాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని