logo

జల్సాలకు అలవాటు పడి.. దొంగతనాలు

31 కేసుల్లో నిందితుడు, సహకరించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పోచారం ఐటీకారిడార్‌ సీఐ బి.రాజువర్మ బుధవారం రాత్రి క్రైమ్‌ ఎస్సై యుగేంధర్‌తో కలిసి వివరాలను మీడియాకు వివరించారు.

Published : 11 Jul 2024 04:05 IST

ఘట్‌కేసర్, న్యూస్‌టుడే: 31 కేసుల్లో నిందితుడు, సహకరించిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పోచారం ఐటీకారిడార్‌ సీఐ బి.రాజువర్మ బుధవారం రాత్రి క్రైమ్‌ ఎస్సై యుగేంధర్‌తో కలిసి వివరాలను మీడియాకు వివరించారు. హయత్‌నగర్‌ మండలం గౌరెల్లికి చెందిన బొంత శంకర్‌(24) జల్సాలకు అలవాటు పడి 2016 నుంచి దొంగతనాలు మొదలెట్టాడు.   జైలులో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన దొంగ జంగం చందన్‌తో పరిచయం అయింది. బెయిల్‌పై వచ్చిన శంకర్‌ గజ్వేల్‌లో ఉన్న చందన్‌ భార్య జంగం లక్ష్మీ(35)తో సహజీవనం చేస్తున్నాడు. రాత్రి వేళ తాళం వేసిన ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులు, బంగారు, వెండి ఆభరణాలు దొంగతనం చేస్తున్నారు. వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 31 చోరీ కేసులు ఉన్నాయి.  యంనంపేట కూడలి వద్ద  శంకర్, లక్ష్మి వస్తుండగా ఎస్సై యుగేంధర్‌ బృందం అదుపులోకి తీసుకుంది. వారి నుంచి చోరీ చేసిన 19 తులాల బంగారం, 77.5 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని సీఐ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని