logo

మూసీకి మాస్టర్‌ప్లాన్‌

మూసీ నది అభివృద్ధికి కీలకమైన మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన ప్రక్రియ పట్టాలెక్కింది. నెల క్రితం అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలవగా.. తాజాగా వాటి పరిశీలన మొదలైంది.

Published : 11 Jul 2024 04:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: మూసీ నది అభివృద్ధికి కీలకమైన మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన ప్రక్రియ పట్టాలెక్కింది. నెల క్రితం అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు పిలవగా.. తాజాగా వాటి పరిశీలన మొదలైంది. ఐదు అంతర్జాతీయ కన్సల్టెన్సీలు దరఖాస్తు చేసుకున్నాయి. వారంలో కన్సల్టెన్సీ ఎంపిక జరగనుంది. అనంతరం 55 కి.మీ పొడవునా మూసీ నదిని పరిశీలించి ఎక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలి తదితర అంశాలతో ప్రణాళికను రూపొందిస్తారు. అందుకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టే అవకాశముందని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని