logo

తేనెటీగల పెంపకంపై అవగాహన 14న

రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వ్యవసాయంలో తేనెటీగల పాత్ర, తేనెటీగల పెంపకం, ప్రభుత్వం అందించే రాయితీలపై ఈ నెల 14న అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 11 Jul 2024 04:07 IST

పంజాగుట్ట, న్యూస్‌టుడే: రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వ్యవసాయంలో తేనెటీగల పాత్ర, తేనెటీగల పెంపకం, ప్రభుత్వం అందించే రాయితీలపై ఈ నెల 14న అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఫౌండేషన్‌ ఛైర్మన్‌ యడ్లపల్లి వెంకటేశ్వర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని కర్షక సేవా కేంద్రం నిర్వహణలో ఖైరతాబాద్‌లోని దక్షిణ భారత హిందీ ప్రచార సభ కార్యాలయం ఆవరణలోని రైతునేస్తం కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నిపుణులు చలపతిరావు పాల్గొని వ్యవసాయంలో తేనెటీగల పాత్ర, వాటి పెంపకం, ప్రభుత్వం అందించే రాయితీలపై అవగాహన కలిగిస్తారన్నారు. 95538 25532 ఫోన్‌నంబరులో సంప్రదించి పేర్లను నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని