logo

విరించి ఆస్పత్రికి హైకోర్టు నోటీసులు

ఆస్పత్రిలోని వ్యర్థాలను నివాస ప్రాంతంలో గుంతతీసి నిల్వ ఉంచడంపై ప్రేమ్‌నగర్‌లోని విరించి ఆస్పత్రికి బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Published : 11 Jul 2024 04:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆస్పత్రిలోని వ్యర్థాలను నివాస ప్రాంతంలో గుంతతీసి నిల్వ ఉంచడంపై ప్రేమ్‌నగర్‌లోని విరించి ఆస్పత్రికి బుధవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆస్పత్రితోపాటు రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్‌ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి తదితర అధికారులకు నోటీసులిస్తూ కౌంటర్ల దాఖలుకు ఆదేశించింది. ఈ సమస్యపై ఖైరతాబాద్‌కు చెందిన రిజ్వాన్‌ఖాన్‌ పిటిషన్‌ దాఖలుతో హైకోర్టు స్పందించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇంటి పక్కనే గుంత తీసి వ్యర్థాలు వేయడంతో కాలుష్యం ఏర్పడుతోందని, వినతిపత్రాలిచ్చినా అధికారులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. గుంత పూడ్చివేతకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీంతో ధర్మాసనం ప్రతివాదుల వాదన వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి విచారణ వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని