logo

నటుడు రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు

నటుడు రాజ్‌తరుణ్‌పై నార్సింగి పోలీస్‌ష్టేషన్‌లో కేసు నమోదైంది.

Published : 11 Jul 2024 04:13 IST

రాజేంద్రనగర్, నార్సింగి, న్యూస్‌టుడే: నటుడు రాజ్‌తరుణ్‌పై నార్సింగి పోలీస్‌ష్టేషన్‌లో కేసు నమోదైంది. తనను ప్రేమించి మోసం చేశాడని ఈనెల 4న కోకాపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 11 ఏళ్లుగా తనతో సహజీవనం చేసిన రాజ్‌తరుణ్‌ మరో మహిళకు దగ్గరై తనను బెదిరిస్తున్నారంటూ ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓసారి అబార్షన్‌ కూడా చేయించాడని ఆమె ఆరోపించడంతో అందుకు ఆధారాలు సమర్పించాలని ఆమెకు పోలీసులు సూచించారు. సంబంధిత మెడికల్‌ రిపోర్టులు, కలిసి జీవించినట్లుగా ఫొటోలను ఆమె నార్సింగి పోలీసులకు అందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు బుధవారం రాజ్‌తరుణ్‌పై 493 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ తెలిపారు. ఆధారాలను బట్టి   మరిన్ని సెక్షన్లు నమోదు చేస్తామని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని