logo

కోర్సులో ప్రవేశానికి అధిక ఫీజు డిమాండ్‌.. ప్రిన్సిపల్‌కు జైలు

కోర్సులో ప్రవేశానికి అధిక ఫీజు డిమాండ్‌ చేసిన మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌కు న్యాయస్థానం రెండేళ్ల జైలు, రూ.1000 జరిమానా విధించింది.

Published : 11 Jul 2024 04:14 IST

కేశవగిరి, న్యూస్‌టుడే: కోర్సులో ప్రవేశానికి అధిక ఫీజు డిమాండ్‌ చేసిన మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌కు న్యాయస్థానం రెండేళ్ల జైలు, రూ.1000 జరిమానా విధించింది. నాంపల్లిలోని సీఎంఎం కోర్టు చీఫ్‌ జ్యూడిషియల్‌ జడ్జి కె.అజేష్‌కుమార్‌ బుధవారం తీర్పు వెలువరించారు.చాంద్రాయణగుట్ట ఇన్‌స్పెక్టర్‌ కె.గురునాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2014 నవంబరులో జరిగిన కౌన్సెలింగ్‌లో.. ఫలక్‌నుమాకు చెందిన మహ్మద్‌ గౌస్‌ అలీ కూతురికి కేటగిరీ-ఏ కింద బీయూఎంఎస్‌ కోర్సులో బండ్లగూడలోని అల్‌-ఆరీఫ్‌ యునానీ మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చింది.  రూ.21వేల డీడీతో గౌస్‌ అలీ తన కూతురు ప్రవేశం కోసం కళాశాలకు వచ్చాడు.  కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మహమ్మద్‌ అహసాన్‌-ఉల్‌-హఖ్‌ అదనంగా మరో రూ.39 వేలు చెల్లించాలని కోరారు.  ఈ కేసులో న్యాయమూర్తి పై విధంగా తీర్పు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని