logo

రాచకొండ కమిషనర్‌గా సుధీర్‌బాబు

రాచకొండ పోలీస్‌ బాస్‌ మళ్లీ మారారు. 2001 బ్యాచ్‌కు చెందిన జి.సుధీర్‌బాబును నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Published : 11 Jul 2024 04:22 IST

బాధ్యతలు స్వీకరిస్తూ..

ఈనాడు- హైదరాబాద్‌: రాచకొండ పోలీస్‌ బాస్‌ మళ్లీ మారారు. 2001 బ్యాచ్‌కు చెందిన జి.సుధీర్‌బాబును నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన తరుణ్జోషిని బదిలీ చేసిన ప్రభుత్వం మళ్లీ జి.సుధీర్‌బాబుకు బాధ్యతలు అప్పగించింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం డిసెంబరు రెండోవారంలో రాచకొండ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి రెండోవారంలో ప్రభుత్వం సుధీర్‌బాబును బదిలీ చేసి తరుణ్‌జోషికి బాధ్యతలు అప్పగించింది. ఇటీవల ఎన్నికలు ముగియడంతో మళ్లీ సుధీర్‌బాబుకు బాధ్యతలు అప్పగించింది. ఉత్తర్వులు వెలువడ్డ కొద్ది గంటల్లోనే సుధీర్‌బాబు నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో బాధ్యతలు చేపట్టారు.

ఏడు నెలల్లో ముగ్గురు: అసెంబ్లీ ఎన్నికల తర్వాత 7నెలల వ్యవధిలో రాచకొండకు ముగ్గురు కమిషనర్లు మారారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే అప్పటి కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ను బదిలీ చేసి సుధీర్‌బాబును నియమించింది. అదే స్థానంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్‌జోషిని నియమించింది. ఇప్పుడు మరోమారు సుధీర్‌బాబు నియమించింది.

ఇద్దరు డీసీపీలకు స్థాన చలనం

ఈస్ట్‌జోన్‌ డీసీపీ గిరిధర్‌ స్థానంలో మెదక్‌ ఎస్పీ బి.బాలస్వామి, సౌత్‌వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఉదయ్‌కుమార్‌ రెడ్డి స్థానంలో రాచకొండ సైబర్‌క్రైమ్‌ డీసీపీ జి.చంద్రమోహన్, ఏఆర్‌ విభాగం డీసీపీగా వనపర్తి ఎస్పీ రక్షితకె.మూర్తి నియమితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని