logo

నెహ్రూ జూ పార్కుకు కొత్త జంతువులొచ్చాయ్‌

హైదరాబాద్‌ నగరంలోని నెహ్రూ జూ పార్కుకు ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పూర్‌ జూ నుంచి జంతు మార్పిడిలో భాగంగా రాయల్‌ బెంగాల్‌ రకానికి చెందిన ఆడ పెద్దపులితో పాటు రెండు చిరుత పులుల జంటలు, జింకల జాతికి చెందిన చౌసింగా, బారాసింగ, కొన్ని పక్షులను జూ అధికారులు మంగళవారం రాత్రి తీసుకొచ్చారు.

Published : 11 Jul 2024 04:29 IST

చార్మినార్, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ నగరంలోని నెహ్రూ జూ పార్కుకు ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పూర్‌ జూ నుంచి జంతు మార్పిడిలో భాగంగా రాయల్‌ బెంగాల్‌ రకానికి చెందిన ఆడ పెద్దపులితో పాటు రెండు చిరుత పులుల జంటలు, జింకల జాతికి చెందిన చౌసింగా, బారాసింగ, కొన్ని పక్షులను జూ అధికారులు మంగళవారం రాత్రి తీసుకొచ్చారు. వారం రోజుల క్రితం నెహ్రూ జూ నుంచి కాన్పూర్‌ జూకు మగ తెల్లపులి, మూడు ఎలుగుబంటిలు, కొన్ని జింకలను ఇక్కడికి పంపించారు. బలమైన జంతువుల సంతతి వృద్ధి కావడానికి కొత్త జంతువులను ఇతర జూల నుంచి తెప్పిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పార్కులో 18 రాయల్‌ బెంగాల్‌ రకానికి చెందిన పెద్దపులులు ఉన్నాయి. వాటిలో తెల్లపెద్దపులులు కూడా ఉన్నాయి. కొవిడ్‌ అనంతరం సెంట్రల్‌ జూ అథారిటీ(సీజడ్‌ఏ) సూచనల మేరకు జూలో పెద్దపులుల సంతతికి బ్రేక్‌ పడింది. ఆడ, మగ పులులు కలవకుండా వేర్వేరుగా ఉంచారు. అయిదు నెలల క్రితం సంతతి వృద్ధిపై విధించిన బ్రేక్‌ను సీజడ్‌ఏ తొలగించడంతో రెండు జంటల ఆడ, మగ పులులను జత కలపడంతో రెండు ఆడ పులులు ఇటీవల గర్భం దాల్చాయి. వాటిలో ఒకటి ఇటీవల రెండు పులి కూనలకు జన్మనిచ్చింది. అవి ఆరోగ్యంగా ఉన్నాయని జూ అధికారులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు