logo

బస్తీ దవాఖానాల్లో డెంగీ పరీక్షలు

ముందస్తు జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, ఇతర వ్యాధులను కట్టడి చేయగలమని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌.చోంగ్తూ పేర్కొన్నారు.

Updated : 11 Jul 2024 05:18 IST

సమావేశంలో మాట్లాడుతున్న క్రిస్టినా జెడ్‌.చోంగ్తూ, పక్కన ఆమ్రపాలి

ఈనాడు, హైదరాబాద్‌: ముందస్తు జాగ్రత్తలతో డెంగీ, మలేరియా, ఇతర వ్యాధులను కట్టడి చేయగలమని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌.చోంగ్తూ పేర్కొన్నారు. నగరంలో తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఆమె జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో కమిషనర్‌ ఆమ్రపాలితో కలిసి సమీక్ష నిర్వహించారు. క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ మాట్లాడుతూ... నగరంలోని 225 బస్తీ దవాఖానాల్లో  జ్వరాలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. నీరసం, జ్వరం వంటి సమస్యలున్న వారు బస్తీ దవాఖానాల్లో వైద్యం తీసుకోవాలన్నారు. జోనల్‌ కమిషనర్లు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, దోమల నివారణ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని