logo

ఐదంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం

ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఐదంతస్తుల్లో ఉన్న శ్రీ దత్తసాయి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది.

Published : 11 Jul 2024 04:38 IST

కాంప్లెక్స్‌ రెండో అంతస్తులో ఎగిసిపడుతున్న మంటలు

రాంనగర్‌: ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో ఐదంతస్తుల్లో ఉన్న శ్రీ దత్తసాయి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో రెండు, మూడు అంతస్తుల్లోని ప్లాస్టిక్‌ గోదాంలలో ఉన్న సామగ్రి దగ్ధమైంది.   మెట్రో స్టేషన్‌కు చెందిన రెండింటితోపాటు అగ్నిమాపకశాఖ  శకటాలు 5 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ కాంప్లెక్స్‌లో చాలా కార్యాలయాలు ఉన్నాయి. ప్రమాద సమయానికి  చాలామంది ఇళ్లకు వెళ్లిపోయారు. మిగతావారు బయటకు వచ్చారు. పొగలు పక్కనున్న అపార్ట్‌మెంట్‌లోకి వ్యాపించడంతో అక్కడివారు కిందికి పరుగులు తీశారు. కిందికి రాలేకపోయిన వృద్ధుడు, ఇద్దరు చిన్నారులను పోలీసులు బయటకు తీసుకొచ్చారు.

మెట్రో స్టేషన్‌ నుంచి నీరు చల్లుతూ మంటలను అదుపు చేస్తున్న సిబ్బంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని