logo

Hyderabad: ఘనంగా ప్రపంచ జనాభా దినోత్సవ వేడుక

ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఏఎస్‌రావు నగర్‌ డివిజన్ పరిధిలోని స్వాగత్ గ్రాండ్‌లో వేడుక నిర్విహించారు.

Published : 11 Jul 2024 16:05 IST

కీసర: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఏఎస్‌రావు నగర్‌ డివిజన్ పరిధిలోని స్వాగత్ గ్రాండ్‌లో వేడుక నిర్విహించారు. ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ జనాభా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం జులై 11న నిర్వహిస్తారన్నారు. ఇది ప్రపంచ జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తుంది అని వివరించారు. ఈ కార్యక్రమం 1989 లో యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం పాలక మండలి స్థాపించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డా. రవీందర్ నాయక్, డీఎంహెచ్‌వో రఘునాథ్ స్వామి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, భారాస నాయకులు సాయి జెన్ శేఖర్, ఆశ వర్కర్స్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని