logo

Hyderabad: హైదరాబాద్‌లో పాతిక వేల లోతైన మ్యాన్‌హోళ్లు.. తెరిస్తే జైలు

గ్రేటర్‌ వ్యాప్తంగా ఉన్న లోతైన మ్యాన్‌హోళ్లను ప్రజలు గుర్తించేలా జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అవి అత్యంత ప్రమాదకరమని చెప్పేలా వాటికి ఎరుపు రంగును అద్దుతోంది.

Updated : 12 Jun 2024 07:33 IST

మ్యాన్‌హోల్‌ మూతకు ఎరుపు రంగు వేస్తున్న సిబ్బంది 

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ వ్యాప్తంగా ఉన్న లోతైన మ్యాన్‌హోళ్లను ప్రజలు గుర్తించేలా జలమండలి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అవి అత్యంత ప్రమాదకరమని చెప్పేలా వాటికి ఎరుపు రంగును అద్దుతోంది.  గ్రేటర్‌ వ్యాప్తంగా 25 వేలకు పైగా లోతైన మ్యాన్‌హోళ్లు ఉన్నాయి. వీటిపై సేఫ్టీ గ్రిల్స్‌ ఏర్పాటు చేయడమే కాకుండా.. వాటికి ఎరుపు రంగును పూస్తోంది. వానాకాలం నేపథ్యంలో మ్యాన్‌హోళ్లలో పడకుండా జాగ్రత్తలతో ప్రజలను అప్రమత్తం చేస్తుంది. 

అలాంటి వారు జైలుకే...

నగరంలోని రహదారులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మ్యాన్‌హోళ్లను ఎవరైనా తెరిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని జలమండలి హెచ్చరించింది. జలమండలి చట్టం 1989 సెక్షన్‌ 74 ప్రకారం అక్రమంగా మ్యాన్‌హోళ్లు తెరిస్తే క్రిమినల్‌ కేసులు పెట్టే అధికారం జలమండలికి ఉంది.  అంతేకాక వానలు కురుస్తుండటంతో ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌(ఈఆర్టీ), సేఫ్టీ ప్రొటోకాల్‌ టీమ్‌(ఎస్పీటీ) వాహనాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. వానాకాలంలో ఎప్పటికప్పుడు మ్యాన్‌హోళ్లను శుభ్రం చేసేందుకు ఎయిర్‌టెక్‌ యంత్రాలను సిద్ధం చేశామన్నారు. సీవరేజ్‌ సమస్యలు ఉంటే ప్రజలు  జలమండలి వినియోగదారుల సేవా కేంద్రం 155313కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని