logo

రామకృష్ణ మఠంలో యువతకు శౌర్య రెసిడెన్షియల్‌ క్యాంప్

రామకృష్ణ మఠంలో ఈ నెల 27 నుంచి యువతకు ‘శౌర్య’ పేరిట క్యాంప్‌ జరగనుంది.

Published : 13 Jun 2024 20:59 IST

హైదరాబాద్‌: రామకృష్ణ మఠంలో ఈ నెల 27 నుంచి యువతకు ‘శౌర్య’ పేరిట క్యాంప్‌ జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో పాల్గొనేందుకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులు అర్హులు. యువకులకు రెసిడెన్షియల్‌ క్యాంప్‌ ఉంటుందని హైదరాబాద్‌ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు. శౌర్య క్యాంపులో యువతకు స్వామి వివేకానంద సందేశంపై ప్రత్యేక తరగతులు ఉంటాయి.  ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు నాయకత్వ లక్షణాల్ని పెంపొందించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బృంద చర్చలతో పాటు ప్రశ్న-జవాబుల సెషన్‌ సైతం నిర్వహిస్తామని  బోధమయానంద తెలిపారు. యోగ, ధ్యానం, భక్తి సంగీతంపై ప్రత్యేక తరగతులుంటాయన్నారు. ఈ క్యాంపునకు హాజరయ్యే యువత తెల్లటి దుస్తులు ధరించాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 91772 32696 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని