logo

Software Engineer: పెళ్లిచూపులకు వెళుతూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దుర్మరణం

పెళ్లి చూపుల కోసం ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న వ్యక్తి జూబ్లీహిల్స్‌లోని రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 24 Jun 2024 07:33 IST

శివశంకర్‌

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: పెళ్లి చూపుల కోసం ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న వ్యక్తి జూబ్లీహిల్స్‌లోని రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా లక్ష్మీపల్లికి చెందిన మీనుగ శివశంకర్‌(31) కొండాపూర్‌లోని ఓ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులైన సుధాకర్, కృష్ణమ్మలకు శివశంకర్‌ పెద్దకుమారుడు కాగా అతని సోదరుడు మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. గతవారం పెళ్లి చూపుల కోసం ఊరికి వెళ్లాడు. అమ్మాయి తరుఫువాళ్లు ఆదివారం వస్తారని తల్లి కుమారుడికి చెప్పింది. మాదాపూర్‌లోని ఓ హాస్టల్‌లో ఉండే అతను శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత తన ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 1లో వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం అతన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో శివ వాహనం కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు 108, పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని శవపంచానామా నిమిత్తం తరలించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా టిప్పర్‌ ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కుమారుడి మరణ వార్త తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని